
ఇండియాస్ బిగ్గెస్ట్ రియాల్టీ షో 'బిగ్ బాస్' తెలుగులో భారీ విజయాన్ని సాధించింది. ఇప్పటికి మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న షో కరోనా మహమ్మారి సమయంలో కూడా ఎంటర్టైన్మెంట్ కు నో మాస్క్ అంటూ నాగార్జున బిగ్ బాస్-4 తో మన ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 6న గ్రాండ్ గా స్టార్ట్ అయింది. అయితే బిగ్ బాస్ అంటేనే ఎన్నో ట్విస్ట్లు, సర్ప్రైజ్లు. అందుకే నిన్న 16 మందిలో సయ్యద్, అరియనా గ్లోరిని ఇంటి లోపలకి పంపకుండా వేరే గదిలో పెట్టి హౌస్ లో ఎం జరుగుతుందో మొత్తం ఆ ఇద్దరు చూసేలా ప్లాన్ చేసాడు బిగ్ బాస్. హౌస్ లోపలకి వెళ్లి కాస్త ఇంటి ఇంటీరియర్స్ ని ఎంజాయ్ చేసే లోపే నామినేషన్స్ అంటూ బాంబ్ పేల్చారు. అయితే కంటెస్టెంట్స్ నామినేషన్ ప్రకీయ పూర్తి చేసిన తరువాత బిగ్ బాస్ వేరే రూమ్ లో ఉంచిన ఆ ఇద్దరి సభ్యులను సిన్ లోకి దింపి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.