
తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో అయిన బిగ్ బాస్ నిన్నటితో మూడు సీజన్ లు పూర్తి చేసుకుంది. భారీ తారాగణం మధ్య నిన్న సీజన్ 3 గ్రాండ్ ఫైనల్ అంగరంగ వైభవంగా జరిగింది. రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలవగా....యాంకర్ శ్రీముఖి రన్నర్ అప్ గా నిలిచింది. అయితే విజేతను ప్రకటించేందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి కాసేపు స్టేజ్ పై సందడి చేశారు. ఇంటి సభ్యులతో మాట్లాడి...వారిపై చురకలు కూడా వేశారు. ఇక సీజన్ 3 పూర్తి అయిందో లేదో సీజన్ 4 గురించి పుకార్లు మొదలయ్యాయి. ఈనేపథ్యంలో సీజన్ 4 హోస్ట్ మెగాస్టార్ చిరంజీవి అంటూ టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. గతంలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కి నాగార్జున హోస్ట్ గా చేశారు. నాగార్జున తర్వాత చిరంజీవి హోస్ట్ గా చేశారు. ఇక ఇప్పుడు మరోసారి పోటీగా నాగార్జున హోస్టింగ్ కి మెగాస్టార్ పోటీగా వస్తున్నట్లు తెలుస్తోంది. సీజన్ 4 మొదలు అయ్యేలోపు చిరంజీవి కమిటీ అయిన సినిమాలు కూడా పూర్తి అవుతాయని సమాచారం.