
బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలేకు దగ్గర పడింది. ఇంకో 10 రోజుల్లో సీజన్ 4 విజేత ఎవరు అన్నది తెలిసిపోతుంది. దానికన్నా ముందు అతి పెద్ద ఘట్టం ఈ నామినేషన్ల నుండి అఖిల్ మినయించి మిగితా ఇంటి సభ్యులు సేవ్ అవ్వాలి. అందులో దేన్గారు జోన్ లో ఉన్నదీ ఉన్న ముగ్గురు అమ్మాయిలు అని తెలుస్తుంది. అయితే ఇంట్లో బోల్డ్ పాపగా పేరు తెచ్చుకున్న అరియనాకు మొన్న సోహెల్ తో జరిగిన గొడవ కారణంగా సపోర్ట్ పెరిగింది. ఆ గొడవతో అరియానాకు విపరీతమైన సపోర్ట్ ఏర్పడింది. అది చాలదు అన్నట్లు బోల్డ్ డైరెక్టర్ ఆర్జీవీ షో చూడకపోయినా అరియానాకు సపోర్ట్ చెయ్యండి గెలిపించండి అంటూ పెట్టిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అది అరియానా పిఆర్ టీం చేయించిన పని అయుండొచ్చు. కానీ ఆర్జీవీ ట్వీట్ పెట్టిన పెట్టకపోయినా మొన్న జరిగిన గొడవతో బోల్డ్ పాప సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయ్.