‘బీష్మ’ ఫస్ట్ గ్లిమ్ప్స్: మళ్ళీ నడుమును పట్టుకోడానికి ప్రయత్నిస్తున్న నితిన్
4 years ago 1 min read

యంగ్ హీరో నితిన్ మళ్ళీ ప్లాప్స్ ఎదురుకుంటున్నాడు. ఇప్పుడు కాస్త జాగ్రత్త పడకపోతే నిలబడడం కష్టమే. 'ఛల్ మోహన్ రంగ', 'లై' సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఛలో సినిమా దర్శకుడు వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బీష్మ' తో రాబోతున్నాడు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కాస్తా రొటీన్ రొమాంటిక్ లవ్ స్టోరీల అనిపిస్తున్నా....యూత్ ను ఆకట్టుకునేలా కనిపిస్తుంది. ఇందులో కూడా మళ్ళీ హీరోయిన్ నడుమును పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు నితిన్. ఇందులో ఉన్న"నా ప్రేమ విజయ్ మాల్యా లాంటిదిరా..కనిపిస్తుంది కానీ దొరకదు" అనే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. నితిన్ కు జంటగా రష్మిక నటిస్తుంది. 2020 ఫిబ్రవరి 21న సినిమాను విడుదల చేయనున్నట్లు ఏ ప్రీ టీజర్ తో క్లారిటీ ఇచ్చారు. అయితే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లిమ్ప్స్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ ను తెలిపింది. నితిన్,త్రివిక్రమ్,పవన్ కళ్యాణ్ సానిహిత్యం గురించి తెలిసిన విషయమే.