
మహేష్ బాబు , రష్మీక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా భారీ అంచనాల నడుమ జనవరి 11న రిలీజ్ అయింది. మరి బొమ్మ దద్దరిల్లిందా లేదా అనేది చూద్దాం!
స్టోరీ: భారతి(విజయశాంతి) దేశభక్తి ఉన్న అన్ని మంచి పనులు మాత్రమే చెయ్యాలని అనుకునే ఒక ప్రొఫెసర్. ఆమెకు ఇద్దరు కొడుకులు. ఇద్దరు ఆర్మీలొనే ఉంటారు. ఆ ఇద్దరిలో ఒకరు చనిపోయి ఒకరు గాయాలపాలయ్యి ఉంటాడు. అజయ్ (మహేష్ బాబు) అదే విషయాన్ని భారతికి చెప్పేందుకు వెళ్తాడు. కానీ భారతి ఆమె కుటుంబంతో కనిపించకుండా పోతుంది. భారతి ఏమైంది ? ఎక్కడుంది ? ఎమ్మెల్యే నాగేంద్ర (ప్రకాష్ రాజ్) పాత్ర ఏంటి ? అనేవి తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
-మహేష్ బాబు
-ఎంటర్టైన్మెంట్
-ఇంటర్వెల్ బ్యాంగ్
-యాక్షన్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
-క్లైమాక్స్
-సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు
పర్ఫార్మెన్స్:
ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ పాత్రలో ఒదిగిపోయాడు. ఎన్నడూ లేని విదంగా 'మైండ్ బ్లాక్' సాంగ్ లో అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకున్నాడు. కేవలం నటన, గ్లామరే కాకుండా ఎమోషన్ సీన్స్ లో మహేష్ డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంది. అజయ్ కృష్ణ పాత్రతో మరోసారి సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. మహేష్ ను టీజ్ చేస్తూ, వెంటపడి ప్రేమించే అమ్మాయిగా చాలా క్యూట్ గా ఉంది రష్మీక. 13ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి భారతి పాత్రకు న్యాయం చేసింది. రాజేంద్రప్రసాద్ పాత్ర పర్వాలేదు అనిపించేలా ఉంది. విలన్ గా ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకించి చెప్పింది ఏముంది. ఆయన నూటికి నూరు శాతం పాత్రలో జీవించారు. ఇక రావు రమేష్, సంగీత, సుబ్బరాజ్, వెన్నెల కిషోర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నీకల్:
అనిల్ రావిపూడి రాసుకున్న స్టోరీ లైన్, దాన్ని అమలు పరిచిన విధానం మెచ్చుకోదగ్గగా ఉన్నాయి. తను అనుకున్న స్టోరీ డిస్టర్బ్ అవ్వకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ ను కూడా బాగా హ్యాండల్ చేసాడు. యాక్షన్, కామెడీ సన్నివేశాలను సరిసమానంగా పొందుపరిచాడు. ట్రైన్ ఎపిసోడ్ కొంచెం సాగతీసినట్లుగా అనిపిస్తుంది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణం పోశాయి.
సమీక్ష:
మహేష్ అన్నట్లుగా సరిలేరు నీకెవ్వరు 'బొమ్మ దద్దరిలిపోయింది'.
రేటింగ్:
3.5/5