బ్రేకింగ్: ఉత్తర్ ప్రదేశ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే అరెస్ట్!

ఉత్తర్ ప్రదేశ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దుబేను మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో గురువారం (జూలై 9) అరెస్టు చేశారు. మహాకల్ ఆలయంలో ప్రార్థనలు చేయడానికి ఉజ్జయినికి వచ్చిన దుబేని మహాకల్ ఆలయంలోని సెక్యూరిటీ గార్డు గుర్తించి, ఉజ్జయిని పోలీసులను పిలిచాడు. పోలీసు సూపరింటెండెంట్ మనోజ్ సింగ్ పెద్ద బెటాలియన్ తో మహాకల్ ఆలయానికి వచ్చి, భయంకరమైన గ్యాంగ్ స్టర్ మరియు అతని అనుచరులను అరెస్ట్ చేశారు. జూలై 3న కాన్పూర్ లోని తన గ్రామంలో ఎనిమిది మంది ఉత్తర్ ప్రదేశ్ పోలీసులను మెరుపుదాడి చేసి చంపిన దాదాపు 150 గంటల తరువాత వికాస్ దుబేను ఉజ్జయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.