
కరోనా మహమ్మారికి ప్రముఖులేమి మినహాయింపు కాదు. ఎవరు కొంచెం అశ్రద్దగా ఉన్నా వారు వారితో పాటు కుటుంబ సభ్యులు చుట్టూ ఉన్న వారు కరోనా భారిన పడటం ఖాయం. మొన్నీమధ్యే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్, కొడుకు అభిషేక్, కోడలు ఐశ్వర్య రాయ్ లకు కరోనా పాజిటివ్ రాగా తాజగా సౌత్ చలన చిత్ర పరిశ్రమకు సుపరిచితుడైన యాక్షన్ హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్యకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆమెకు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని హోమ్ క్వారంటైన్ లో ఉందని తెలిసింది. అందుకే అందరూ మాస్క్లు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండటం ఎంతో ముఖ్యం.