
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన 'నేను శైలజ','ఉన్నది ఒక్కటే జిందగీ' వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన కిషోర్ తిరుమల ముచ్చటగా మూడోసారి రామ్ తో తమిళ్ రీమేక్ కోసం జతకట్టారు. ఈ సినిమాకు 'రెడ్' అనే టైటిల్ ను ఖరారు చేసి టీజర్ ను సైతం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. టీజర్ తో సహా విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన లభించింది. అయితే ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా మహమ్మారి కారణంగా పోస్ట్ పోన్ అయింది. ఓటిటి దిగ్గజాలు భారీగా అఫర్ చేసినప్పటికీ చిత్ర యూనిట్ థియేటర్ లోనే రిలీజ్ చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే, తాజాగా ఒక ఓటిటి దిగ్గజం 30 కోట్ల భారీ మొత్తాన్ని అఫర్ చేసినప్పటికీ యూనిట్ సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు సమాచారం.