
కేరళను భారీ వర్షం ముంచెత్తింది. రాష్ట్రంలోని 12 జిల్లాలో కుండపోత వర్షం కురవనుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే అరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంటే 11 నుంచి 20 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షం కారణంగా కేరళలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మరోవైపు కేరళలోని వట్టియూర్కావు, అరూర్, కొన్నీ, ఎర్నాకుళం, మంజేశ్వరం నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే భారీ వర్షం కొన్ని చోట్ల పోలింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తోంది. దీంతో కొన్ని పోలింగ్ స్టేషన్లలో.. బూత్‌లను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కు షిప్ట్ చేశారు. భారీ వర్షాల కారణంగా తాము ఓటు వేయలేకపోతున్నామని కొందరు ఓటర్లు ఆవేదన వక్తం చేస్తున్నారు.