
పట్టణాల్లో ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం అంటే సాధారణ విషయమేమి కాదు. వాహనదారులను ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చేయడానికి పోలీసులు నానాతంటాలు పడాల్సి వస్తుంది. వాహనాలను రాంగ్ పార్కింగ్‌లో నిలిపినా, రాంగ్ రూట్లో వెళ్లినా ట్రాఫిక్ పోలీసులు విజిల్స్‌తో హెచ్చరిస్తుంటారు.. అయినా పట్టించుకోకుండా వాహనదారులలో కొంతమంది తాము వెళ్లాలనుకున్న దారిలోనే వెళ్తుంటారనుకోండి అది వేరే విషయం. ఇటువంటి ఘటనలతో చిర్రెత్తుకువచ్చిందేమో ఏమో.. క్రమశిక్షణ లేని వాహనదారులను గాడిలో పెట్టేందుకు కొత్త దారి ఎంచుకున్నారు. ఇందుకోసం ఓ పాప్ సింగర్ పాడిన ‘భోలో తరా రా రా..’ పాటను ఫాలో అయ్యాడు. దీంతో ఆ పాట విన్న వాహనదారులు అప్రమత్తమవుతున్న వీడియో చూసిన ప్రముఖ పాప్ సింగర్ దలేర్ మహాంది తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. వివరాలు.. చండీగడ్‌లోని ఓ ట్రాఫిక్ పోలీసు వాహనాలను రాంగ్ ప్లేస్‌లో పార్క్ చేయగానే మైక్‌లో ప్రముఖ పాప్ సింగర్ దలేర్ మెహాందీ పాడిన పాపులర్ పాటను తలపించేలా ‘భోలో తా రా రా... క్రేన్ తీసుకురావాలా!’ అంటూ పాట పాడి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు.