
మరికాసేపట్లో సుప్రీంకోర్టు ఇవ్వనున్న అయోధ్య తీర్పుపై సార్వత్ర ఉత్కంఠ నెలకుంది. దేశమంతా హై అలెర్ట్ కొనసాగుతుంది. సుప్రీంకోర్టు వద్ద భారీ పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి గొడవలు, హింసాత్మక చర్యలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా తీర్పు ఎలా ఉన్నా ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. అలానే తాజాగా టీడీపీ అధినేత మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా అయోధ్య తీర్పుపై ట్వీట్ చేశారు. 'నేడు అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. మతపరమైన అనుబంధాల వల్ల మనం దూరం కాకూడదు. మనం కోర్టు ఇచ్చే తీర్పును గౌరవించాలి. సమాజంలో శాంతి మరియు సామరస్యాన్ని కాపాడటానికి ఐక్యంగా ఉందాం’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. అలానే పలు కీలక నేతలు కూడా ప్రజలను ఎటువంటి హింసాత్మక చర్యలకు పూనుకోకండని... కోర్టు తీర్పు గౌరవించాలని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.