మరోసారి ప్లాప్ డైరెక్టర్ కు ఒకే చెప్పిన రామ్

హీరో రామ్ పోతినేని తాజాగా నటించిన చిత్రం “ఇస్మార్ట్ శంకర్” బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ప్లాప్స్ తో డీలా పడ్డ పూరి జగన్నాధ్ ను నమ్మి సినిమా తీసి పూరికి తిరిగి ఒక హిట్ ఇచ్చాడు రామ్. ఇక ఇస్మార్ట్ శంకర్ తర్వాత కిషోర్ తిరుమలతో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కేందుకు సమయం పడుతుంది. దీంతో మళ్ళీ ఒక మాస్ పాత్రలో కనిపించాలని అనుకుంటున్నాడట రామ్. ఈ క్రమంలో మాస్ మసాలా డైరెక్టర్ వి వి వినాయక్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. వినాయక్ కి కూడా ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ హిట్ లేదు. కానీ అతను చెప్పిన కథ నచ్చడంతో వేరే ఏమి ఆలోచించకుండా ఒకే చెప్పేశాడట. కిషోర్ తిరుమల సినిమా కన్నా ముందు ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి రామ్ మరోసారి మాస్ మసాలా పాత్రలో ఫ్యాన్స్ ను అలరించడం ఖాయంగా కనిపిస్తుంది.