
సూపర్ స్టార్ మహేష్ నటించిన తాజా చిత్రం మహర్షి ఈ ఏడాది రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు. మహేష్ కు జంటగా పూజా హెగ్డే నటించింది. కసితో ఒక పెద్ద ఐటీ కంపెనీకి సీఈఓ అయ్యి ఆ తర్వాత రైతు గురించి, రైతు పడే కష్టాల గురించి, రైతు లేకపోతే అన్నం లేదు అన్న పాయింట్ మీద సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో మహేష్ నటనపై విమర్శకులు ప్రశంసల జల్లు కురిపించారు. జగపతిబాబు, అల్లరి నరేష్ ముఖ్య పాత్రలు వహించారు. అయితే తాజాగా ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. 2019లో ట్విట్టర్ టాప్ 5ట్రేండింగ్ లో మహర్షి సినిమా 4వ ప్లేస్ లో ఉండటం విశేషం. ఇందులో టాప్ 1లో ‘విశ్వాసం’ సినిమా నిలిచింది. 2ప్లేస్ లో లోక్సభ ఎన్నికలు, మూడో ప్లేస్లో వరల్డ్ కప్ 2019, నాల్గో ప్లేస్లో మహేష్ బాబు మహర్షి సినిమా, ఇక ఐదో ప్లేస్లో దీపావళి ట్యాగ్ నిలవడం విశేషం.