
samantha
అక్కినేని సమంత ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఈరోజున అక్కినేని వారి కోడలిగా ఇంటి పేరును నిలబెడుతుంది. ఒక పక్క సినిమాలు చేస్తూనే ఇంటి బాధ్యతలు కూడా చూసుకుంటుంది. సమంత గోల్డెన్ హీరోయిన్ అయిపోయింది అనడంలో సందేహం లేదేమో. ఆమె చేసే ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. మొన్నీమధ్య భర్త నాగచైతన్యతో కలిసి నటించిన 'మజిలీ' మంచి ఆధరణ దక్కించుకుంది. ఇక ఆ తరువాత సమంత ఫోకస్ అంత కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై పెట్టిందని జోరుగా వినిపించింది. అయితే సోషల్ మీడియాలో నాని-సమంతల సినిమా అంటూ ఒక పోస్టర్ వైరల్ గా మారింది. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటిస్తున్న చిత్రంలో సమంత హీరోయిన్ అంటూ ఆ పోస్టర్ లో ఉంది. దీంతో అది ఫిక్ అని చెప్పేందుకు శివ నిర్వాణ రంగంలోకి దిగి.... అందులో ఎంత మాత్రం వాస్తవం లేదని..తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే చెప్తానని అన్నారు.