
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత అల్లు అర్జున్ మరే సినిమాలోనూ కనిపించలేదు. రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న బన్నీ ఇప్పుడు వరుసగా సినిమాలు లైన్ అప్ చేసాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అల..వైకుంఠపురంలో' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే నటిస్తుంది. థమన్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ గా నిల్వనున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల గ్యాప్ ను భర్తీ చేసే విధంగా అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు హల్ చల్ చేస్తున్నాయి. మరి ముఖ్యంగా తాజాగా రిలీజ్ అయిన 'రాములో రాముల' పాట మాస్ కు పిచ్చిపిచ్చిగా ఎక్కేసింది. మాస్ తో పాటు పిల్లలు సైతం ఈ ఆల్బమ్ ను ఎంజాయ్ చేయటం విశేషం. ఇక ఇప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్ ను టెర్గెట్ చేస్తూ 'డాడీ...డాడీ' అనే పాటను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీని తర్వాత టీజర్ ను విడుదల చేసేలా చూసుకుంటున్నారట. మొత్తానికి సినిమా విడుదల అయ్యేవరకు ప్రమోషన్స్ భారీగా ప్లాన్ చేసినట్లు అర్ధం అవుతుంది.