
ఒక్క సినిమాతో స్టార్ హీరోకు ఉన్నంత క్రేజ్ దక్కించుకున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో ఎంట్రీ ఇచ్చి అర్జున్ రెడ్డితో దిమ్మతిరిగే హిట్ కొట్టి ఆ తర్వాత గీతా గోవిందం, టాక్సివాల లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే తాజాగా వచ్చిన 'డియర్ కామ్రేడ్' మాత్రం ఆ ఖాతాలోకి చేరలేకపోయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన డియర్ కామ్రేడ్ అంచనాలను అందుకోలేకపోయింది. బాక్స్ ఆఫీసు వద్ద తుస్సుమంది. మొన్నీమధ్యే విజయ్ నిర్మాణంలో వచ్చిన మొదటి సినిమా "మీకు మాత్రమే చెప్తా" కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇక గాడి తప్పిన బండిని మళ్ళీ లైన్ లో పెట్టాలంటే తన తదుపరి సినిమా హిట్ అవ్వాల్సిందే. విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "వరల్డ్ ఫెమస్ లవర్". ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. చిత్ర బృందం గుమ్మడికాయ కూడా కొట్టేసారట. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉన్నారు. మొత్తానికి ఈ సినిమాపై విజయ్ గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు.