
వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా దళిత నేపథ్యంలో వచ్చిన సినిమా 'అసురన్' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. రూ.100కోట్లకు పైగా సాధించి రికార్డు సృష్టించింది. మామూలుగానే రీమేక్‌ల హవా కొనసాగుతున్న టైంలో ఇంత భారీ హిట్ పడితే తెలుగులో రీమేక్ చేయకుండా ఉంటారా? దగ్గుబాటి వెంకటేష్ హీరోగా అసురన్ ను రీమేక్ చేసేందుకు రంగం సిద్ధం చేసాడు నిర్మాత సురేష్ బాబు. కానీ డైరెక్టర్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. మొదట అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తారని అన్నా... ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది. కొత్తబంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, బ్రమోత్సవం వంటి క్లాస్ చిత్రాలను డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాల అసురన్ ను రీమేక్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే అంత క్లాస్ సినిమాలను డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాల అసురన్ లాంటి బోల్డ్, రస్టిక్, యాక్షన్ చిత్రాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనే ఆసక్తి అందరిలో మొదలైంది.