
'అట్లీ' పేరుకు తమిళ డైరెకటిరే కానీ తెలుగులో కూడా అయన సినిమాలను ఇష్టపడే వారు చాలామంది ఉన్నారు. అట్లీ చేసిన సినిమాల్లో "రాజా రాణి", "తేరి", "మెర్సల్" తెలుగులో సైతం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు తాజాగా విజయ్ హీరోగా అట్లీ డైరెక్ట్ చేసిన "బిగిల్" కూడా అదే రేంజ్ లో రికార్డులు సృష్టిస్తుంది. ఊహించని విధంగా సుమారు రూ. 300 కోట్లు వసూళ్లు చేసినట్లు తెలుస్తుంది. కోట్లు కొల్లగొట్టే టాలెంట్ అట్లీ దగ్గర ఉంది కాబట్టే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా అతనితో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు. షారుఖ్ అభిమానులు ఆయన్ను తెరపై చివరిగా చూసింది 2019 లో వచ్చిన 'జీరో' సినిమాలో. అందుకే మళ్ళీ ఎప్పుడు తెరపై కనిపిస్తారాని ఆశగా ఎదురుచూసిన వారికి తీపి కబురు వచ్చింది. అట్లీ- షారుఖ్ సినిమా వచ్చే ఏడాది మార్చ్ లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందులో ఎన్నడూ చూడని విధంగా షారుఖ్ కనిపిస్తారని తెలుస్తుంది. అయితే అధికార ప్రకటన రావాల్సి ఉంది.