
బిగ్ బాస్ సీజన్ 3 ఘనంగా ముగిసింది. ముగిశాక విన్నర్ గా నిలిచిన రాహుల్ వరుస ఇంటర్వ్యూలతో మంచి జోరు మీద ఉన్నాడు. కానీ రన్నర్ అప్ గా నిలిచిన శ్రీముఖి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఫోన్ చేస్తుంటే రిచ్ అవ్వట్లేదు. ఆమెతో షో చేయాలని టీవీ ఛానెల్స్, పార్టీ ఇవ్వాలని తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ట్రై చేస్తుంటే ఈ అమ్మడు జాడ తెలియలేదు. అయితే బిగ్ బాస్ హౌస్ లో 105 రోజుల పాటు కుటుంబాన్ని, ఫ్రెండ్స్‌ని వదిలేసి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా గడిపిన శ్రీముఖి హౌస్ నుండి బయటకు రాగానే ఫ్రెండ్స్ తో ఫన్ కోసం మాల్దీవ్స్ కు చెక్కేసింది. తాజాగా మాల్దీవ్స్ లో ఆమె ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుందో ఒక వీడియో ద్వారా తెలిపింది. నాని గ్యాంగ్ లీడర్ సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ మంచి జోష్ మీదుంది. ఈ వీడియోలో యాంకర్ విష్ణుప్రియా, ఆర్జే చైతూ, శ్రీముఖి తమ్ముడు కూడా ఉన్నారు. ఆమె పెట్టిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.