
బీజేపీ ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ గురించి ఓనమాలు కూడా తెలియవని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌లు కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో నుంచి ఆలోచనలను, ప్రణాళికలను దొంగిలించాలని అని హితవు పలికారు. ‘సాధారణంగా గ్రామీణ వినియోగం, పట్టణ వినియోగం కన్నా ఎక్కువ వేగంతో పెరుగుతుంటుంది. కానీ సెప్టెంబర్‌తో ముగిసే త్రైమాసికంలో అది రివర్స్ అయింది. గత ఏడేళ్లలోనే కనిష్ట స్థాయిలో గ్రామీణ వినియోగం ఉంది’ అంటూ వచ్చిన ఒక మీడియా రిపోర్ట్‌ను ప్రస్తావిస్తూ.. ‘గ్రామీణ భారతం సంక్షోభంలో ఉంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉంది. ఏం చేయాలో తెలీని స్థితిలో కేంద్రం ఉంది’ అని ట్వీట్ చేశారు.