
జనసేన పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ తీవ్రంగా స్పందించారు. అక్కడ సందర్భం ఏంటి ?మీరు మాట్లాడింది ఏంటి? ఉపరాష్ట్రపతి అన్న గౌరవం కూడా లేకుండా అలా ఎలా మాట్లాడారంటూ ప్రశ్నించారు. మీరు చేసుకోండి మూడు పెళ్లిల్లు ఎవరు వద్దు అన్నారు. నేను మూడు పెళ్లిల్లు చేసుకునేందుకే మీరు, సూట్ కేసుల విజయసాయిరెడ్డి రెండేళ్లు జైల్లో ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. మీరు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు తెస్తామంటే మాకేమి ఇబ్బంది లేదు. కానీ టీచర్లకు సరైన ట్రైనింగ్ లేకుండా....పైలెట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని అన్నారు. మీరు తిరుపతిలో సుప్రభాతం కూడా ఇంగ్లీష్ లో చదివించుకోండి. మీకు ఒక పద్ధతి లేదు కదా....మీరు ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఉపరాష్ట్రపతికి గౌరవం ఇవ్వకపోవడం బాధాకరం అంటూ జగన్ ఓయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.