
తెలుగు ఇండస్ట్రీకి బాస్ అభిమానులకు మెగాస్టార్ అయిన చిరంజీవి తెర మీద కనిపిస్తే చాలు పండగ చేసుకుంటారు. చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి మంచి ప్రశంసలు దక్కడమే కాకుండా ఇది కేవలం చిరంజీవికే సాధ్యం అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి కొరటాల శవ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అయితే కొరటాల అండ్ టీం మంచి ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. నక్సెల్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రంలో రెండు భిన్నమైన పాత్రల్లో చిరు కనిపించనున్నారట. ఇప్పుడు ఉన్న హావభావాలతో మొదట అభిమానులకు నచ్చే విధంగా ఒక పాట చిత్రీకరణ చేస్తారని సమాచారం. ఎంతోకాలంగా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్న టీం ఎట్టకేలకు ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి చేసింది. ఇక ఒక ముఖ్యమైన పాత్ర కోసం తెలుగు హీరోయిన్ అయిన ఈషా రెబ్బాను ఎంపిక చేసుకున్నారట. ఆమె పాత్ర సినిమాకు కీలకమని తెలుస్తోంది. ఇక చిరు సరసన హీరోయిన్ గా త్రిషను అనుకుంటున్నట్లు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.