
బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న కూచ్ బెహర్ లో నిన్న సీఎం మమతా బెనర్జీ సభ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ...బీజేపీ నుండి డబ్బులు తీసుకోని ఓ హైదరాబాద్ పార్టీ మైనారిటీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని పరోక్షంగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీను ఉద్దేశించి ప్రసంగించారు. హిందువుల్లో లాగా మైనారిటీల్లో అతివాదం, రెచ్చగొట్టుడు ధోరణి పెరుగుతోందన్నారు. హైదరాబాద్కు చెందిన ఓ పొలిటికల్ పార్టీ బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని ఈ పని చేస్తోందని ఆరోపించారామె. మమతా బెనర్జీ మాటలకు కౌంటర్ ఇస్తూ....పశ్చిమ బెంగాల్లో ఎంఐఎం బలపడాన్ని చూసి ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో బెంగాల్ లోని 42 సీట్లలో 18 సీట్లు బీజేపీ ఎలా గెలిచిందో చెప్పాలన్నారు ఒవైసీ.