
బిగ్ బాస్ షో ఇప్పటికే సగం పూర్తి అయ్యింది. గత సీజన్ల మాదిరిగా ఈ సీజన్ ఆకట్టుకోలేకపోతుంది అనడంలో ఎటువంటి సందెమ్ లేదు. అందుకే యాజమాన్యం ఆచి తూచి అడుగులు వేస్తుంది. ఈ వారం నానామినేట్ అయినా ఇంటి సభ్యులు....అలీ, రాహుల్, మహేష్, శ్రీముఖి, రవి. నిన్నటి ఎపిసోడ్లో వీరిలో నుంచి రాహుల్ సేవ్ చేయటం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎలిమినేటి కాబోతున్న ఇంటి సభ్యుడు ఇతనే అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. ఇంతకీ ఆ ఇంటి సభ్యుడు ఎవరు అంటే....."అలీ రైజా". హౌస్ లో అలీ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. మొదటి నుంచి టాస్క్‌ల పరంగా సత్త చాటుతూ వస్తున్నాడు. ఆరు వారాల్లో నామినేట్ అవ్వని అలీను అదే కారణంతో ఈ వారం నామినేట్ చేసారు. అనూహ్యంగా నామినేట్ అయినా మొదటి వారమే అలీ ఇంటికి వెళ్ళిపోతున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పటి వరకు వచ్చిన కధనాలు అన్ని నిజం అయ్యాయి. మరి ఇది కూడా నిజమో కాదో తెలియాలి అంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.