
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్ర అసెంబ్లీలకు సోమవారం పోలింగ్ కొనసాగుతున్న విషయం తెల్సిందే. మొదటి సారి బీజేపీ ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న దేవేంద్ర ఫడ్నవీస్, మనోహర్ లాల్ ఖట్టర్‌లు, మరోసారి ముఖ్యమంత్రులుగా కొనసాగాలని కోరుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు ప్రాంతీయంగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు నమూనా నాయకులు. వారేమీ ఎన్నికల ద్వారా ప్రముఖులుగా గుర్తింపు పొందిన నాయకులూ కాదు, సీఎం పదవిలో పోటీలో ఉన్న వ్యక్తులు కూడా కాదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కులానికో, వర్గానికో చెందిన వారు కూడా కాదు. అనూహ్యంగా ముఖ్యమంత్రులైన ఇరువురు ఆరెస్సెస్‌కు చెందిన వారు.