
యంగ్ హీరో సందీప్ కిషన్ వరుస ప్లాప్స్ తో డీలా పడ్డ కిషన్ నినువిడను నీడను నేనే సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు సందీప్ కిషన్. ఇప్పుడు సక్సెస్ వచ్చిన జోష్ లో మరో ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి తెరక్కెక్కిస్తున్న తెనాలి రామకృష్ణ బి.ఏ బి.ఎల్ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ చూసిన దానిబట్టి సందీప్ ఫన్నీ లాయర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో యాక్షన్ సీన్స్ లో సందీప్ డూప్ లేకుండా నటించి గాయలపాలయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో సందీప్ వరలక్ష్మిని ట్యాగ్ చేస్తూ "గుడ్ ఆఫ్టర్ నూన్ వరూ మేడమ్. ఏ యాంగిల్ లో చూసినా మీరు మంచి విలన్ గా కనిపిస్తున్నారు"అంటూ కామెంట్ చేశాడు. దానికి వరలక్ష్మి రిప్లై ఇస్తూ "నవ్వుతూ నోరు ముయ్యిరా రాస్కెల్" అని ఫన్నీగా రిప్లై ఇచ్చింది. ఇది వారి మధ్య ఉన్న బాండింగ్ తెలిపేలా ఉంది.