
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, అజిత్‌లను హర్ట్ చేశాడట. అవును ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలలో ఇదే హాట్ టాపిక్. అసలు మెగాస్టార్ కోలీవుడ్ టాప్ హీరోలను ఎందుకు హర్ట్ చేశాడు. అంత అవసరం ఏం వచ్చింది అనుకుంటున్నారా...?అసలు విషయానికి వస్తే ఇటీవల మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా లూసిఫర్. మలయాళ యువ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమా మాలీవుడ్‌లో ఘన విజయం సాధించింది. వందకోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు చాలా మంది స్టార్ హీరోలు ప్రయత్నించారు.