
రాజమౌళి, పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ గురించి ప్రపంచం మాట్లాడుకునేలా చేసిన దర్శక దిగ్గజం. అయితే రాజమౌళి 'యమదొంగ' సినిమాకు దర్శకత్వం వహించడమే కాక సొంత బ్యానర్ విశ్వామిత్ర క్రియేషన్స్ పై ప్రొడ్యూస్ చేయటం కూడా జరిగింది. సినిమా హిట్ అయినప్పటికీ పార్ట్నర్లతో వచ్చిన సమస్యల కారణంగా డబ్బులు పెద్దగా రాలేదు. దీంతో ప్రొడక్షన్ కు బై చెప్పేశాడు. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు విశ్వామిత్ర క్రియేషన్స్ పై మంచి సినిమాలను ప్రొడ్యూస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఓటీటీ దిగ్గజాలు పెద్ద మొత్తంలో ఒకేసారి చెల్లిస్తామని ముందుకు రావటంతో మంచి కధలను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి రాజమౌళికి ఈసారైనా నిర్మాణంలో లక్ కలిసొస్తుందేమో చూడాలి.