
సినీ నటుడు రాజశేఖర్ కు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో వెళ్తుండగా కారు బోల్తా పడింది. అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి కారు పల్టీ కొట్టింది. కారు బోల్తా పడిన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. రాజశేఖర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. రాజశేఖర్ తో పాటు కారులో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజశేఖర్ తిరిగి హైదరాబాద్ వస్తుండగా శంషాబాద్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రాజశేఖర్ తో పాటు గాయపడ్డ మరో వ్యక్తి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. రాజశేఖర్ కాళ్లు, చేతులకు గాయాలు అయినట్టు సమాచారం. విజయవాడ నుంచి తిరిగి వస్తున్న రాజశేఖర్ నేరుగా జూబ్లీహిల్స్ వెళ్లేందుకు ఔటర్ రింగ్ రోడ్డులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఎటువంటి నష్టం జరగలేదు.