
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RRRతో బిజీగా ఉన్నాడు. వినాయ విధేయ రామ సినిమాతో నిరాశపడ్డ ఫ్యాన్స్ లో తన తదుపరి సినిమాతో తిరిగి ఉత్సాహం నింపాలని ఫిక్స్ అయ్యాడు. ఇకపోతే తాజాగా రామ్ చరణ్ ను దర్శకుడు విక్రమ్ కె కుమార్ కలిసినట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ తో సినిమా తిదామనుకోని వర్క్ ఔట్ అవ్వకా...నానితో గ్యాంగ్ లీడర్ సినిమా తీసి హిట్ కొట్టాడు. అప్పుడు వర్క్ ఔట్ అవ్వలేదు కాబట్టి ఈసారి ఎలాగైనా మెగా హీరోతో సినిమా తీయాలని కసితో ఉన్నాడు. అందుకే రామ్ చరణ్ ను కలవటం స్టోరీ చెప్పడం జరిగిందట. కేవలం ఒక లైన్ చెప్పి ఉరుకోకుండా డెప్త్ గా కథను వివరించాడట.అయితే రామ్ చరణ్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. మరి అర్జున్ తో సినిమా తీయటం ఫెయిల్ అయిన విక్రమ్ రామ్ చరణ్ తో సక్సెస్ అవుతాడేమో చూడాలి.