
విజయ్ సేతుపతిని కొలీవుడ్లో 'మక్కల్ సెల్వన్' గా పిలుచుకుంటారు మరియు ఈ బహుముఖ హీరో ఇటీవల తన రాబోయే చిత్రం 'తుగ్లక్ దర్బార్' యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే... సినిమాల్ప్ విజయ్ సేతుపతి రెండు షెడ్స్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఒక వైపు, రఫ్ గా, సీరియస్ గా ఉంటే మరో వైపు ఒక విలన్ తరహాలో భయంకరంగా నవ్వుతూ కనిపిస్తున్నాడు. పోస్టర్ చూస్తుంటే, రెండు పాత్రల్లో విజయ్ దుమ్ము రేపనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అదితిరావు హైదారి, మంజిమా మోహన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అలానే, విజయ్ సేతుపతి విష్ణు తేజ్ నటిస్తున్న 'ఉప్పెన' సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.