
వైఎస్ జగన్ తో ఎన్నికల ప్రచారంలో నడిచి పార్టీ కోసం తనవంతు కృషి చేసింది నగరి ఎమ్మెల్యే రోజా. జగన్ రోజాను చెల్లిలాగా భావిస్తారని పార్టీ నేతలు చెప్పుకుంటారు. వైకాపా కోసం ప్రత్యేక్షంగా, పరోక్షంగా కృషి చేసిన రోజాపై జగన్ ఫైర్ అయినట్లు తెలుస్తుంది. పదవిపై, రాజకీయాలపై ఫోకస్ పెట్టకుండా జబర్దస్త్ షోకు ప్రాధాన్యం ఇవ్వటమెంటని కడిగిపారేసరట. నీకు పదవి బాధ్యతలు అప్పగించిప్పుడు అవి సరిగ్గా చేయకుండా టీవీ షోలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం సరికాదని హెచ్చరించారట. రోజా గత 7ఏళ్లుగా జబర్దస్త్ జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు జగన్ ఆమెకు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పర్వాలేదు కానీ అధికారంలోకి వచ్చాక షోలకు ఎక్కువ సమయం కేటాయించడం సరికాదని చెప్పారట. రాజకీయంగా ఎదగాలంటే కొన్ని వదులుకోక తప్పదని తెలిపారట.