
అబ్దుల్లాపూర్ తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు గురైన విషయం విధితమే. అతికిరాతకంగా ఆఫీస్ లోకి వచ్చి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి హత్య చేశాడు. ఆమె హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. రోజు రోజుకు ఈ కేసులో కొత్త కోణాలు బయట పడుతున్నాయి. తాజాగా విజయారెడ్డి మాట్లాడ్తున్నట్లుగా ఒక ఆడియో విడుదల అయింది. ఆ ఆడియో కారణంగా టీఆరెస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఆరోపణలు చేయడంతో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను విజయారెడ్డిను బెదిరించాను అనడంలో ఎటువంటి నిజం లేదని... అలాంటి ఆరోపణలను నమ్మవద్దని కోరారు. ఆమె హత్య కేసును రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. 6 నెలల కిందట నేను రైతులతో కలిసి కలెక్టర్ ను కలిసేందుకు వెళ్లానని వివరించారు. విజయారెడ్డి హత్య కేసులో నిందితుడైన సురేష్ తమ పార్టీ నుంచి ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని వివరణ ఇచ్చారు.