
తాజాగా జరిగిన ఓ సమావేశంలో చంద్రబాబు తనకు చింతమనేని ప్రభాకర్ స్ఫూర్తి అని చెప్పడం జరిగింది. దీనిపై దేందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి బాబుపై విమర్శలు గుప్పించారు. 14ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఒక రౌడీషీటర్ అయిన చింతమనేని ప్రభాకర్ స్ఫూర్తి ఏంటని ? ప్రశ్నించారు. దీని ద్వారా మీరు ఈ సమాజానికి ఎటువంటి సందేశం ఇద్దాం అనుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలు చేసిన వారిలో చింతమనేని మొదటి స్థానంలో ఉంటారు. ఆయన ఇసుక, మట్టి అక్రమంగా తవ్వి లోకేష్ కు ఇచ్చినందున మీరు ఆయన స్ఫూర్తి అంటున్నారాని ? ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం చట్టపరంగా తన పని తాను చేయటం వల్లనే ఆంధ్రప్రదేశ్ ఇంత ప్రశాంతంగా ఉందని.... అది చూసి ఓర్వలేకపోతున్నారని బాబుపై ఫైర్ అయ్యారు. చింతమనేని వల్ల ఎంతమంది నష్టపోయారో తెలుసుకోవాలంటే దేందులూరులో రివ్యూ మీటింగ్ పెట్టాలన్నారు.