
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్ రాష్ట్రాన్ని సర్వం దోచుకొని లోటు బడ్జెట్ పరిస్థితి తెచ్చారని వైస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. ఆయన గురువారం తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్తవ్యదీక్షతో సడలని విశ్వాసంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని, ప్రజలంతా కలకాలం వైఎస్ జగన్ వెంటే ఉంటారని అన్నారు. సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనను చూసి ఓర్వలేకే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విలువలూ విశ్వసనీయత గురించి చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని అన్నారు.