
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ఒకడైన వరుణ్ తేజ్ ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రోజు నుంచి భిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఫిదా, తొలిప్రేమ, అంతరిక్షం లాంటి క్లాస్ సినిమాలు తీసిన వరుణ్ తాజాగా గద్దలకొండ గణేష్ లో మాస్ నెగిటివ్ రోల్ లో కనిపించి నేను మాస్ పాత్రలు కూడా చేయగలనని నిరూపించాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రకు ప్రేక్షకుల నుండి క్రిటిక్స్ నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ప్రస్తుతం నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటితో బాక్సింగ్ నేపథ్యంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం వరుణ్ కొన్ని రోజుల నుంచి ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడట. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. ఈ చిత్రం కోసం ప్రొడ్యూసర్ అల్లు బాబీ ఎంతైనా కర్చుపెట్టేందుకు సిద్ధం అయ్యారట. అయితే కథకు హీరోయిన్ గా కీయార అద్వానీ బాగుంటుందని భావించిన యూనిట్ ఆమెను సంప్రదించగా...ఆమె భారీగా రెమ్యునరేషన్ అడిగినట్లు...దానికి బాబీ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.