
అసెంబ్లీ ఎన్నికల ముందు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏ రేంజ్ లో పాదయాత్ర చేశారో వేరే చెప్పాల్సిన పని లేదు. కిలోమీటర్లు కిలోమీటర్లు కాళ్లు అరిగిపోయేలా తిరిగి ఓట్లు సంపాదించి అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఇదిలావుండగా.... ఎక్కడెక్కడ విలువైన భవనాలు ఉన్నాయి....భూములు ఉన్నాయని తెలుసుకోడానికే జగన్ పాదయాత్ర చేశారంటూ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. అధికారులను బదిలీ చేసే అధికారం ప్రభుత్వంకు ఉంది. కానీ సీఎస్ ఎల్వి సుబ్రమణ్యంను మాత్రం కక్షతో బదిలీ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న ఇసుకను అక్రమంగా పక్క రాష్ట్రాలకు బదిలీ చేసి...ఇక్కడి కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా పరిపాలిస్తున్నారని నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు.