
రాజుగారి గది ఫ్రాంచైజ్ లో వచ్చిన మూడవ చిత్రం రాజుగారి గది 3 గత శుక్రవారం విడుదలైంది. హారర్ కామెడీ జోనర్ లో వచ్చిన ఈ మూవీకి క్రిటిక్స్ నుండి మిశ్రమ స్పందన లభించి. ఐతే టాక్ ఎలా ఉన్నా రాజుగారి గది 3 తన స్థాయి వసూళ్లతో పరవాలేదనిపిస్తుంది. నిన్న ఆదివారం ఈ మూవీ నైజాంలో 37లక్షల షేర్ వసూళ్లు సాధించింది. ఇక మొత్తంగా వీకెండ్ ముగిసేనాటికి రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి మూడురోజులకు గాను, 3.5 కోట్ల షేర్ రాబట్టింది. ఈ చిత్ర బడ్జెట్ మరియు హక్కుల అమ్మకాల దృష్ట్యా ఈమూవీ ఇంకా రెండు మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ చేరే అవకాశం కలదు.