
బిగ్ బాస్ సీజన్3 కు ప్రజలు ఎంతలా అలవాటు పడ్డారంటే....ఇప్పుడు ఆ షో పూర్తయ్యేసరికి వాళ్లకు ఏమి తోచట్లేదు. రోజు రాత్రి 9:30 అయితే చాలు టీవీలకు అతుక్కుపోయి తమకు నచ్చిన కంటెస్టెంట్స్ కు ఓట్లు వేసుకుంటూ...వాళ్ల నవ్వులు, ఏడుపులు, గొడవలను ఎంజాయ్ చేస్తూ వచ్చారు. కొన్నిరోజుల క్రితం షో పూర్తవ్వడంతో బిగ్ బాస్ ప్రేక్షకులకు దిక్కుతోచడం లేదు. ఇది ఇలా ఉంటే, ఈ షోలో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. షోలో వీళ్లు పండించిన కెమిస్ట్రీ అలాంటిది మరి. ఓం స్క్రీన్ కెమిస్ట్రీ చూసి వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు. ఈ ఇద్దరు బయటకు వచ్చి మా మధ్య అలాంటిదేమి లేదని చెప్పిన నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుకే దీన్ని క్యాష్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు. త్వరలో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి కలిసి... లవ్ స్టోరీ సినిమాలో నటించబోతున్నట్లు తెలిసింది. వీళ్లకు ఉన్న క్రేజ్ గమనించిన ఓ నిర్మాత వీరితో సినిమా తీసేందుకు రెడీ అయ్యారట. దానికి రాహుల్, పునర్నవిలు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.