
కన్నడ భామ రష్మీక మందాన తెలుగులో వరుస ఆఫర్లతో మంచి జోరు మీద ఉంది. ప్రస్తుతం మహేష్ సరసన సరిలేరు నికెవ్వరు చిత్రంలో నటిస్తోంది. అలానే యంగ్ హీరో నితిన్ తో భీష్మలో నటుస్తుంది. ఇవి కాకుండా ఆమె చేతిలో మరో 4 సినిమాలు ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్న ఈ భామ ... తనపై వస్తున్న రూమర్లకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ హాట్ ఆన్ స్క్రీన్ జోడి అంటే వెంటనే అందరికి గుర్తొచ్చేది విజయ్ దేవరకొండ-రష్మీక. ఈ ఇద్దరు కలిసి రెండు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. దాంతో వీరిపై రూమర్స్ రావటం కూడా అంతే సాధారణం. తాజాగా సోషల్ మీడియాలో రష్మీక విజయ్ తో ప్రేమలో ఉందని పెట్టిన ఒక పోస్ట్ పై రష్మీక ఘాటుగా స్పందించింది. 'సినీ తారలు కలిసి నటిస్తే చాలు ఇలాంటి నెగిటివ్ పోస్ట్లు పెడతారు. ఎం వస్తుంది దీని వల్ల? యాక్టర్స్ గా ఉండటం ఈజీ కాదు. మేము చేసే సినిమాలను విమర్శించే హక్కు ఉంది. కానీ మా వ్యక్తిగత విషయాలపై అలాగే ఫ్యామిలీలను విమర్శించే హక్కు లేదు. ఎవరు కూడా ఇలాంటి విమర్శలు ఎదురుకోకూడదని కోరుకుంటున్నాను. మీరు అనుకున్నది సాధించారు. మనసు నొప్పించడంలో మీరు సక్సెస్ అయ్యారని వివరణ ఇచ్చింది.