
ఒక్క సినిమాతోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. రౌడీ బాయ్ గా యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. విజయ్ దేవరకొండ కనిపిస్తే చాలు అమ్మాయిలు కేకలు పెట్టడం మొదలు పెడతారు. అయితే ఈమధ్యకాలంలో విజయ్ గాడి తప్పినట్లు తెలుస్తుంది. విజయ్ చేసిన సినిమాల్లో 'నోటా' అలాఎం తాజాగా రిలీజ్ అయినా 'డియర్ కామ్రేడ్' బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. తాజాగా హీరోగా తనను పరిచయం చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తూ 'మీకు మాత్రమే చెప్తా' చిత్రాన్ని నిర్మించాడు. అది కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దాంతో తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఇకపై కొత్త డైరెక్టర్ లతో చేయటం తగ్గించి అనుభవం ఉన్న వారితో చేస్తే మంచిదని అనుకుంటున్నాడట. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వరల్డ్ ఫెమస్ లవర్' పై ఆశలు పెట్టుకున్నాడు. క్రాంతి మాధవ్ ఇప్పటికే రెండు హిట్లు ఇచ్చిన కారణంగా తనకు ఒక హిట్ ఇస్తాడని ఆశిస్తున్నాడు. ఇక ఆ తర్వాత మాస్ డైరెక్టర్ పూరితో ఒక సినిమా చేయనున్నాడు. అయితే పూరి సినిమాకు ముందే నూతన దర్శకుడితో 'హీరో' సినిమా చేయాల్సి ఉంది. కానీ నూతన దర్శకుడితో ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయటం మంచిది కాదని దాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తుంది.