
వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా దళిత నేపథ్యంలో వచ్చిన సినిమా 'అసురన్' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అందుకే దగ్గుబాటి వెంకటేష్ హీరోగా అసురన్ ను రీమేక్ చేసేందుకు రంగం సిద్ధం చేసాడు నిర్మాత సురేష్ బాబు. మొదట అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తారని అన్నా... ఇప్పుడు కొత్తబంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, బ్రమోత్సవం వంటి క్లాస్ చిత్రాలను డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాల అసురన్ ను రీమేక్ చేస్తున్నారు. వెంకటేష్ ఇప్పటికే F2, వెంకీ మామ సినిమాలతో మంచి జోష్ మీదున్నాడు. 2020లో అదే జోష్ తో అసురన్ రీమేక్ లో నటించనున్నాడు. అయితే సీనియర్ నటి ప్రియమణి తెలుగు అసురన్ లో ముఖ్య పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న ప్రియమణికి వరుస ఆఫర్లు వస్తున్నప్పటికీ నచ్చినవి మాత్రమే అంగీకరిస్తుంది. ఈమేరకు వెంకటేష్ కి సతీమణిగా అసురన్ రీమేక్ లో నటించడానికి గ్రీన్ ఇచ్చింది.