
అక్కినేని నాగచైతన్య, వెంకటేష్ దగ్గుబాటి రియల్ లో మామ అల్లుళ్లు అన్న సంగతి తెలిసిందే. అలాంటిది ఈ ఇద్దరు అదే పాత్రల్లో కనిపిస్తే ఇక అంచనాలు పెరగకుండా ఎలా ఉంటాయి?. సంక్రాంతి కానుకగా ఈ ఇద్దరు నటించిన వెంకీమామ రిలీజ్ కానుంది. జై లవ కుశ సినిమాను డైరెక్ట్ చేసిన బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా రిలీజ్ కు కొన్ని రోజులే ఉండటంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా వెంకీమామ టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పాటలో అల్లుడు చైతన్యకు మామ వెంకీ అంటే ఎంత ప్రేమ ఉందో చెప్తుంది. థమన్ పాటకు క్లాస్ ట్యూన్ చక్కగా కంపోజ్ చేశారు. లిరికల్ వీడియోలో వెంకటేష్, చైతు మధ్య సరదాగా సాగే సన్నివేశాలు, చిత్ర చిత్రీకరణని చూపించారు. వెంకటేష్ కు జంటగా పాయల్ రాజ్ పూత నటిస్తుండగా, చైతన్య కు రాశిఖన్నా నటిస్తుంది.