
అక్కినేని ఫ్యామిలి నుంచి వారసులు వచ్చినప్పటికీ నాగార్జున ఏ మాత్రం తగ్గకుండా వారికి పోటీ ఇస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఒక పక్క సినిమాలు చేస్తూనే....మరోపక్క బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ నిమిషం ఖాళీ లేకుండా గడుపుతున్నారు. మొన్నీమధ్యే బిగ్ బాస్ షోలో హోస్ట్ గా రచ్చ రచ్చ చేశారు. ఇక తండ్రి నాగేశ్వరరావు గౌరవార్థం సినీ పరిశ్రమలో తమదైన ముద్ర వేసినవారికి ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ ను ప్రతి ఏడాది ఇస్తుంటారు. ఈ ఏడాది 17న ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జునకు యాంకర్ విపరీతమైన కోపం తెప్పించింది. సామాన్యంగా కూల్ గా ఉండే నాగార్జునకు కోపం వచ్చిందనేసరికి ఫిలిం నగర్ లో ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ జరిగిందేంటటే.... ఒకవేళ మీ నాన్నగారు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండి మీరు హోస్ట్‌గా ఉంటే .. మీ రియాక్షన్ ఏంటి అని ప్రశ్నించింది. ఈ ప్రశ్న నాగ్ కు కోపం తెప్పించింది. దీంతో లోకంలో లేని నాన్నగారిని బిగ్ బాస్ లోకి ఎందుకు లాగుతారని యాంకర్ పై అసహనం వ్యక్తం చేస్తూ....కెమెరా ఆఫ్ చేయండంటూ కాస్త సీరియస్ అయ్యాడట. దీంతో వెంటనే ఆమె సారి చెప్పిందట. మొత్తానికి యాంకర్ ఆ ప్రశ్న అడగడం తప్పని అభిప్రాయపడుతున్నారు.