
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెలుగు, హిందీలో ఎన్నో హిట్ చిత్రాల్ని తెరకెక్కించాడు. ఆయన దర్శకత్వం వహించిన వాటిల్లో ముఖ్యంగా శివ, రంగిలా, క్షణ క్షణం, గోవిందా గోవింద, రక్త చరిత్ర బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి. రామ్ గోపాల్ వర్మ చివరిగా నాగార్జున హీరోగా ఆఫీసర్ అనే సినిమాను తెరకెక్కించారు. సినిమాల కన్నా ఎక్కువగా తన మాటలు, ట్వీట్ల వల్ల ఫెమస్ అయ్యాడు అర్జీవి. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా ఉంటాడు అర్జీవి. వేరే సినిమాలపై, రాజకీయాలపై అర్జీవి చేసే ట్వీట్లు సంచలనాలకు దారి తీస్తాయి. అలానే తాజాగా లోకాన్ని విడిచి వెళ్లిన అతిలోక సుందరి శ్రీదేవిపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. "నాకు చివరిగా ఒక గంట సేపు బ్రతికే అవకాశం ఉంటే...శ్రీదేవి సమాధి పక్కనే కూర్చుంటాను. ఇక చనిపోయాక ఆమె సమాధి పక్కనే నా సమాధి కూడా ఉంటుందని" సంచలన వ్యాఖ్యలు చేసాడు.