
ఈమధ్యకాలంలో సీనియర్ హీరోయిన్లు రీ ఎంట్రీలతో దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. అప్పట్లో హాట్ హాట్ గా కనిపించి కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన సీనియర్ నటీమణులు తమ సెకండ్ ఇన్నింగ్స్ లో అమ్మ పాత్రల్లో హోమ్లీగా కనిపిస్తూన్నారు. ఇక ఇప్పుడు ఇద్దరు సీనియర్ హీరోయిన్లు పోటీ పడేందుకు సిద్ధం అవుతున్నారు. లేడీ సూపర్ స్టార్ అయిన విజయశాంతి మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'సరిలేరు నిక్కేవరు ' చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు టబు అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'అల..వైకుంఠపురంలో' చిత్రంలో అమ్మగా కనిపిస్తున్నారు. అయితే ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాల ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్న ఇద్దరు సీనియర్ హీరోయిన్లు ఒకే రోజు తలపడనున్నారు. ఈ రెండు చిత్రాలు సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానున్నాయి. ఒకరు తల్లి పాత్రలో కనిపించబోతుంటే.. మరొకరు రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ పాత్రతో దర్శనమివ్వనున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు ప్రేక్షకులను ఎక్కువగా మెప్పిస్తారో చూడాలి.