
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. సూపర్ హిట్ మహర్షి తరువాత మహేష్, బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 తరువాత అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా కావటంతో సరిలేరు నీకెవ్వరుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. జనవరి 12న సినిమా రిలీజ్ అంటూ అధికారిక పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. అయితే అక్కడే వచ్చింది అసలు సమస్య, అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమాను కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్.