
ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి నిలబడడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎప్పటి నుంచో స్థిరపడున్న తారలను కాదని కొత్త వాళ్ళను పెట్టుకోవాలంటే వాళ్ళు ఏ రేంజ్ లో కష్టపడాలో, మెప్పించాలో అర్ధం చేసుకోవచ్చు. సమంత అటువంటి స్థాయి నుంచి వచ్చింది. తనకంటూ సినీ పరిశ్రమలో ఎవరు తెలీదు...అయినప్పటికీ ఒక్కో మెట్టు ఎక్కుతూ గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. ఇక ఇప్పుడు అక్కినేని వారి కోడలిగా మరింత పేరు సంపాదించుకుంది. ఆమె ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. కెరీర్ తొలినాళ్లలోనే తనకు ఆఫర్లు, సక్సెస్ వచ్చిపడినా మనసులో ఏదో ఆందోళన, భారంగా అనిపించేది. ఏదో తెలియని భారం వెంటాడేది. అంతేకాదు హీరోయిన్ అంటే ఎన్నో ఆంక్షలు ఉండేవి. అలాంటి స్టేజ్ నుంచి నన్ను నేను ఆవిష్కరించుకునే దశకు చేరుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అలానే ఇప్పుడు చేసే పాత్రలో తనని తాను కొత్తగా చూసుకుంటున్నాని... అందుకే మొదట్లో ఉన్న ఒత్తిడి, భారం ఇప్పుడు తొలిగిపోయాయని...దానికి కారణం కుటుంబం, చిత్ర పరిశ్రమలో కొత్త పరిణామాలు అని చెప్పుకొచ్చింది సమంత.