
అక్కినేని కుటుంబంలోకి వెళ్ళాక సమంత పాత్రలను ఎంచుకునే పద్ధతి మారింది. పెళ్లి తర్వాత హీరోయిన్లకు కెరియర్ ఉండదు. పిల్లలు, ఇంటికే అంకితం అవుతుంది అనుకున్న వారికి షాక్ ఇచ్చింది. నా పెళ్ళి అయినంత మాత్రాన నా కెరియర్ ముగిసిపోయినట్లు కాదని వరుస హిట్లతో నిరూపించింది. యూటర్న్, సూపర్ డీలక్స్, ఓ బేబీ, మజిలీ ఇలా పెళ్లి తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. ఆమధ్య ఇకపై లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తానని సమంత చెప్పడంతో గ్లామర్ కు గుడ్ బై చెప్పేసిందని అనుకున్నారు అభిమానులు. కానీ సోషల్ మీడియాలో ఆమె పోస్టులు చూస్తే మాత్రం అలా అనిపోయించడం లేదు. ఇప్పుడు ఆమె మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలే కాదు కథ,కథనం బాగుంటే స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఎక్స్పోజింగ్ చేయటంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. పాత్ర డిమాండ్ చేస్తే బోల్డ్ సీన్స్ లోకూడా నటించేందుకు సిద్ధమని చెప్పింది. దీంతో నాగార్జున షాక్ లో ఉన్నారట. కానీ ఈ విషయంలో ఎవరు ఏమి చెప్పినా వినేలాలేదని తెలుస్తోంది. తన కెరీర్‌కు భర్త చైతూ నుంచి పూర్తి సపోర్ట్ ఉందని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ.