
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లింది. ప్రతి ఒక్కరు గర్వపడేలా చేశారు. బాహుబలి సినిమా తర్వాత ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇండస్ట్రీ బడా హీరోలతో ఆర్ ఆర్ ఆర్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఒక తెరపై కనిపిస్తారనడంతో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమాలో కోమరం బీమ్ గా ఎన్టీఆర్, సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెల్సిందే. దీని కోసం ఆ ఇద్దరు వారి లుక్స్ ను పూర్తిగా మార్చుకున్నారు. రామ్ చరణ్ కోరమీసంతో క్లిన్ షేవ్ చేసుకోని కనిపించాడు. సైరా ప్రమోషన్స్ మొత్తం అదే లుక్ తో చేసాడు. ఇక ఇప్పుడు సరికొత్త గెటప్ లో దర్శనమిచ్చాడు. కోరమిసం తీసేసి... పాత లుక్ లో కనిపిస్తున్నాడు. ఎప్పటిలానే కొంచెం గడ్డంతో కనిపిస్తున్నాడు. క్యారెక్టర్ లో ఉన్న వేరియేషన్స్ కోసం రామ్ చరణ్ తన లుక్ ని మార్చుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు